ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. జట్ట ఓపెనర్ యువ బ్యాట్స్ మెన్ శుబ్ మాన్ గిల్ గాయం బారిన పడ్డాడు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ప్రస్తుతం అక్కడే ఉంది. వచ్చే నెలలో ఆడనున్న విషయం తెలిసిందే. అందుకోసం అక్కడే ఆగిపోయిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అయితే ఈ సిరీస్ కు ఇంకా నెల రోజుల సమయం ఉండగా అక్కడే చికిత్స తీసుకుంటున్న గిల్ పరిస్థితిని భారత ఫిజియో నితిన్ పటేల్ గమనిస్తున్నారు. అయితే ఆసీస్ సిరీస్ లో రాణించిన గిల్ తర్వాత భారత్ వేదిక ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లోను అలాగే ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోను నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసిన స్ప్రింటర్ ద్యూతీ చంద్