న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 టఫ్ మ్యాచ్‌లో టీమిండియా దంచికొడుతోంది. మొదటి నుంచి హిట్టింగ్ మూడులోనే ఉన్న భారత బ్యాట్స్‌మన్.. ఒక్కో ఓవర్‌కి 10 పరుగులకు తక్కువ కాకుండా రాబట్టారు. అయితే.. మొదట ఒవర్ దాటిన వెంటనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) పరుగుకే అవుటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్‌కు తోడుగా రాహుల్ త్రిపాఠి (44) వచ్చాడు. ఎనిమిదో ఓవర్లో 87 పరుగుల వద్ద త్రిపాఠి పెవిలియన్ చేరడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 12ఓవర్లో 125 పరుగుల వద్ద సూర్యకుమార్ (24)పరుగులకు అవుటయ్యాడు.
కాగా, అప్పటికే ఓపెనర్‌గా వచ్చిన గిల్ మాంచి ఫామ్‌లో ఉండడంతో దబిడ దిబిడ అనించాడు. చివరగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించి 17వ ఓవర్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో పాండ్యా కూడా సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఇట్లా 19వ ఓవర్ వరకు 228 పరుగుల స్కోరు అయ్యింది. కాగా సిక్స్ కొట్టబోయిన హార్దిక్ పాండ్యా (30) పరుగుల వద్ద బోర్డర్లో క్యాచ్ అవుటయ్యాడు. దీపక్ హుడా 2* తో కలిసి ఆఖరి ఓవర్ ఆడిన గిల్ 126* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ మొత్తం స్కోరు నాలుగు వికెట్లు కోల్పోయి.. 234 పరుగులు చేయగా, న్యూజిలాండ్ టార్గెట్ 235 పరుగులుగా ఉంది..