ముంబై – న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అతను వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీం మేనేజ్మెంట్ శ్రేయాస్ స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయ్యర్‌ను మినహాయించడంతో రజత్ పాటిదార్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. దేశవాళీ మ్యాచ్‌ల్లో రజత అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. కాగా, రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. తొలి వన్డే హైదరాబాద్ లో జరగనుంది..ఇప్పటికే జట్టు హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement