ఐపీఎల్ కొత్త సీజన్-2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సారథులను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. గత సీజన్-2023లో కేకేఆర్‌కు నాయకత్వం వహించిన నితీష్ రాణాను వైస్ కెప్టెన్‌గా నియమించిన నైట్‌రైడర్స్ యాజమాన్యం ఇప్పుడు అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు మళ్లిd కెప్టెన్సీ అప్పజెప్పింది. గాయంతో ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు దూరమైన అయ్యర్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరగి జట్టులో చేరుతున్నాడు.
దాంతో శ్రేయస్‌కి తిరిగి కెప్టెన్సీ అప్పగిస్తున్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ గురువారం స్వయంగా వెల్లడించింది. కాగా గత సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా జట్టు చెత్త ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కీలక ఆటగాళ్లు ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ తదితరులు విఫలమవడంతో కేకేఆర్ 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన నితీష్ 14 ఇన్నింగ్స్‌లలో 2 హాఫ్ సెంచరీలతో 413 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ తిరిగి రాకతో కేకేఆర్ రాతా మారుతుందేమో చూడాలి.