ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ఇంటిదారి పట్టగా తాజాగా సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కూడా ఇంటిముఖం పట్టాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో జకోను ఇటాలియన్ స్టార్ జనిక్ సినర్ ఓడించాడు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్‌ను 6-1, 6-2, 6-7 (6/8), 6-3తో ఓడించి మొదటి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు జనిక్ చేరుకున్నాడు.
సెమీస్‌లో నొవాక్ జకోవిచ్ వరుసగా తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో కోల్పోయాడు. 22 ఏళ్ల యువ ప్లేయర్ జనిక్ సినర్ ఆట ముందు.. జకో ఏ నిలవలేకపోయాడు. మూడో సెట్‌లో పోరాడిన జకోవిచ్ 7-6 (8/6)తో రేసులో నిలిచాడు. అయితే నాలుగో సెట్‌లో విజృంభించిన సినర్.. 6-3తో సెట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2018 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌కి ఇది మొదటి ఓటమి. అంతేకాదు మెల్‌బోర్న్ పార్క్‌లో జొకోవిచ్ రికార్డు (33) మ్యాచ్‌ల విజయ పరంపరను సిన్నర్ ముగించాడు.