ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఓటమితో బాధలో ఉన్న గుజరాత్‌కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటా న్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన విషయం తెలిసిందే.
భారీ లక్ష్యఛేదనలో పంజా బ్ యువ బ్యాటర్ శాశంక్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయాన్ని తమ జట్టువైపు తిప్పుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లోనూ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఆడలేదు. అతని స్థానంలో కేన్ విలియమ్స్‌న్ తుది జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా మిల్లర్ గాయం గురించి విలియమ్సన్ కీలక అప్డేట్ ఇచ్చాడు.. జట్టులో తిరిగి రావడం సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం బాధగా ఉంది. అతడు గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరిన్ని మ్యాచుల్లో ఆడే అవకాశం లేదు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
మిల్లర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని కేన్ పేర్కొన్నాడు. కాగా, డేవిడ్ వచ్చే వరకు విలియమ్సన్ జట్టుతో ఉంటాడని గుజరాత్ టైటాన్స్ యజమాన్యం తెలిపింది. మిగతా నాలుగు మ్యాచ్‌లకు మిల్లర్ దూరమయ్యే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ 27 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి తమ జట్టును గెలిపించాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.