Saturday, October 5, 2024

Canada Open | వరల్డ్‌ నెం.4కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన రజావత్‌

కెనడా ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అండర్స్‌ ఆంటోన్సెన్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో 39వ ర్యాంకర్‌ ప్రియాన్షు రజావత్‌ 21-11, 17-21, 21-19 తేడాతో వలర్డ్‌ నెం.4, డెన్మార్క్‌ స్టార్‌ ఆంటోన్సెన్‌పై అద్భుత విజయం సాధించాడు. అయితే, ప్రపంచ టాప్‌-10 ర్యాంక్‌లోని షట్లర్‌పై విజయం సాధించడం రజావత్‌కు ఇదే తొలిసారి. ఇక సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌కు చెందిన అలెక్స్‌ లానియర్‌ను ఢీ కొననున్నాడు.

పోరాడి ఓడిన గాయత్రి ద్వయం..

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రిసా జాలీ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. శనివారం ఉదయం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రిసా జాలీ 18-21, 21-19, 16-21 తేడాతో చైనీస్‌ తైపీకి చెందిన హ్లీ పెయ్‌ షాన్‌-హంగ్‌ ఎన్‌ ట్జు ద్వయం చేతిలో పోరాడి ఓడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement