ఐపీఎల్ 2024లో మంచి జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఈ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా కాన్వే ఈ ఐపీఎల్‌కు దూరమయ్యాడని చెన్నై సూపర్ కింగ్స్ వెల్లడించింది. కాన్వే స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్‌ను జట్టులోకి తీసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కాన్వాయ్ ఎడమ బొటనవేలు విరిగింది. కాన్వాయ్‌కు శస్త్రచికిత్స జరిగింది. కాన్వే కోలుకోవడానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో అతని స్థానంలో జట్టులో రిచర్డ్ గ్లీసన్ జట్టులోకి తీసుకుంది సీఎస్కే.
రిచర్డ్ గ్లీసన్‌కు తొలి ఐపీఎల్
ఇంగ్లండ్ ఆటగాడు రిచర్డ్ గ్లీసన్‌కు ఇదే తొలి ఐపీఎల్. రూ.50 లక్షల బేస్ ధరకు చెన్నై అతడిన జట్టులోకి తీసుకుంది. గ్లీసన్ ఇంగ్లండ్ తరఫున ఆరు టీ20లు ఆడాడు. 8.90 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. మొత్తం టీ20 కెరీర్లో 90 మ్యాచ్‌లు ఆడిన గ్లీసన్ 101 వికెట్లు పడగొట్టాడు.