ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీనుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనుంది. అంతేగాకుండా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. టి 20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ రంగం సిద్దం చేస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలను ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్‌కు అప్పంగించినట్లు బిసిసిఐ వెల్లడించింది.
టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గొనే క్రీడాకారులకు విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతలు శిఖర్ ధావన్‌కు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28వ తేదీనుంచి సౌతాఫ్రికాతో మూడు టి 20లు, మూడు వన్డేలను ఇండియా ఆడనుంది. తిరువనంతపురంలో సెప్టెంబర్ 28వ తేదీన తొలి టీ 20 జరుగనున్నది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రెండో టీ 20 అక్టోబర్ 2న గౌహతిలో జరుగనుంది. 4న ఇండోర్‌లో మూడో టీ 20 జరుగుతుంది. ఇదే చివరి టీ 20. ఇక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదికగా వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. ఆ టీమ్‌కు శిఖర్ ధావన్ లీడ్ చేస్తాడు. రాంచి, ఢిల్లిలో అక్టోబర్ 9,11 తేదీల్లో వరుసగా రెండో, మూడో వన్డేలు జరుగనున్నాయి. రాంచీ, ఢిల్లి వేదికలుగా ఇవి జరుగనున్నాయి.