ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ప్రధానకోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ షెల్లీ నిట్క్షే ఎంపి కైంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారికంగా వెల్లడించింది. షెల్లీ నాలుగేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు మాథ్యూమాట్ హెడ్‌కోచ్‌గా పనిచేశారు. ఆమె స్థానంలో షెల్లీ కొత్తగా బాధ్యతలు చేపట్టనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా షెల్లీ గుర్తింపు పొందింది. 80వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది.
తన కెరీర్‌లో 3000పరుగులు, 150 వికెట్లు తీసింది. కోచ్‌గానూ ఆమెకు అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత దేశవాళీ జట్టు సౌత్ ఆస్ట్రేలియాకు కోచ్‌గా పనిచేసింది. అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేసింది. 2019నుంచి బిగ్‌బాష్‌లీగ్‌లో పెర్త్ స్కార్చర్ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తోంది.