Tuesday, November 26, 2024

Shami : కోలుకుంటున్న ష‌మీ…

లండ‌న్ లో చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి కోలుకుంటున్నాడు. ఈ మేర‌కు అత‌డు త‌న సోష‌ల్ మీడియా వివ‌రాలు వెల్ల‌డించాడు. తన కుట్లు విప్పారని తెలిపాడు. ”అంతా ఎలా ఉన్నారు! నాకు శస్త్రచికిత్స జరిగి 15 రోజులైంది. ఇటీవలే కుట్లు విప్పారు.

కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కోలుకునే ప్రక్రియంలో తర్వాతి దశ కోసం చూస్తున్నా” అని పేర్కొన్నాడు. షమి గాయం కారణంగా నిరుడు వన్డే ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఆ టోర్నీలో అతడు 24 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడని షమి ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కి కూడా అందుబాటులో ఉండ‌టం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement