ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్కప్ ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీకి స్టార్ పేసర్ మహ్మద్ షమి దూరం కానున్నాడు. గతనెల 26న షమి చీలమండ గాయానికి లండన్లో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను ఎప్పటి నుంచి బరిలోకి దిగుతాడనే విషయమై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టతనిచ్చాడు.
- Advertisement -
ఇప్పటికే షమి ఐపీఎల్లో ఆడని విషయం తేలిపోగా.. తాజాగా అతను సెప్టెంబరులో బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి అందుబాటులో ఉంటాడని షా పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత ఓటమి తర్వాత షమి గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ చేయించుకుంటూనే ఆ వరల్డ్కప్ ఆడినట్టు షమి అప్పట్లో తెలిపాడు. ప్రస్తుతం షమి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకుంటున్నాడు.