ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్‌లో టీమిండియా అమ్మాయిలు దుమ్మురేపారు. సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించి.. ఇవ్వాల ఫైనల్లో ఆడారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో అమ్మాయిల జట్టు అదుర్స్ అనిపించింది. కెప్టెన్ షఫాలీ సేన బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా నిలిచి వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచిన టీమిండియా అమ్మాయిల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 17 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఆట కట్టించారు బౌలర్లు. కాగా, టీమిండియా బౌలర్ల దాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ జట్టు 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. 69 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన షఫాలి వర్మ టీమ్.. దీటుగా ఆడింది. ఈ క్రమంలో కెప్టెన్ షఫాలీ (15), శ్వేత (5) పరుగులకు అవుటయ్యారు. ఇక ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్యా తివారి 24*, గొంగడి త్రిష (24) పరుగులతో మాంచి ఆటతీరు కనబరిచారు. మరో వికెట్ కోల్పోకుండా స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే క్రమంలో త్రిష 24 పరుగుల వద్ద అవుటయ్యింది. సౌమ్యకి తోడుగా హ్రిషితా బసు 0* క్రీజులోకి చవ్చింది. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా అమ్మాయిల అండర్ 19 జట్టు వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది.
కాగా, ఈ జట్టులో అత్యంత ప్రభావవంతమైన ఆటతీరు కనబరిచిన గొంగడి త్రిష తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి కావడం గర్వకారణమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ఇతర ప్రముఖులు అభినందించారు.