పాక్ మహిళా క్రికెటర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెండ్ చేసింది. మహిళా క్రికెటర్ ఫిర్యాదు మేరకు ఉన్నతస్థాయి దర్యాప్తునకు పీసీబీ ఆదేశించింది. విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించింది.
కోచ్ నదీమ్‌తోపాటు అతని స్నేహితులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నదీమ్ 1980, 1990లలో దేశవాళీ క్రికెట్ ఆడాడు. అయితే జాతీయ జట్టులో అతనికి చోటు దక్కలేదు. దేశవాళీలో మాత్రం నదీమ్.. 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 258 వికెట్లు పడగొట్టాడు.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.