టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే వారం జరుగనున్న లావర్ కప్ తనకు చివరి ఏటీపీ ఈవెంట్ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 41 ఏళ్ల స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచి దిగ్గజ ఆటగాడిగా కీర్తి గడించాడు. గాయాలతో సతమతమవుతున్న ఫెదరర్ … 2021 జులైలో జరిగిన వింబుల్డన్ తర్వాత ఏ టోర్నీలోనూ ఆడలేదు.
గ్రాండ్ స్లామ్‌ల్లో ఒకటైన యూఎస్ ఓపెన్ ముగిసిన కొద్ది రోజులకే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి అభిమానులకు షాకిచ్చాడు ఫెదరర్. 310 వారాల పాటు టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్‌లో 1500కుపైగా మ్యాచ్‌లు ఆడానని చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించింది అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. కానీ టైటిల్ గెలవలేకపోయింది.