ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తాజాగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. దీంతో శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే భారత్-శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘే బోర్డుని రద్దు చేశారు. బోర్డులోని సభ్యులందరినీ తొలగించారు.
ఆ స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. క్రికెట్ ఎన్నికలు జరిగేంత వరకూ ఈ కమిటీని కొనసాగించనుంది. దానికి అర్జున రణతుంగ నేతృత్వం వహించనున్నారు. అయితే, ప్రభుత్వం బోర్డ్‌ని రద్దు చేసే ముందే బోర్డ్ కార్యదర్శి మోహన్ డి సిల్వా రాజీనామా చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై శ్రీలంక క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. క్రికెట్ బోర్డ్ సెక్రటరీ ఇంటి ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు.