కివిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఎదురు ఈదుతున్నది.. లంచ్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాలలో పడింది. న్యూజిలాండ్ ఇద్దరు స్పిన్నర్లే టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. పుణేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా భోజన విరామ సమయానికి 38 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసింది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడుతున్నారు. స్కోరింగ్ ఇబ్బందిగా మారింది. విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
గిల్ 30 రన్స్ చేసి ఔటవ్వగా, పంత్ 18 రన్స్‌కు వెనుదిరిగాడు. ఫస్ట్ టెస్టులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ 11 రన్స్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు. సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. 16 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా అసలు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోతున్నది. కివీస్ స్పిన్ ఉచ్చులో ఇండియన్ బ్యాటర్లు చిక్కుకుపోయారు. సాంట్నర్ 4, ఫిలిప్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. క్రాస్ బ్యాట్ షాట్ ఆడబోయిన పంత్, కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా 152 రన్స్ వెనుకబడి ఉన్నది.