Tuesday, November 19, 2024

Second Test – సిరాజ్ స్వింగ్ కు స‌పారీలు క్లీన్ బౌల్డ్… 55 పరుగులకుఅలౌట్

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు.. నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు అతడి ధాటికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు స‌మ‌ర్పించుకుంది. తొలుత ఐదెన్ మార్‌క్రమ్ (2), డీన్‌ ఎల్గర్ (4), టోనీ డిజోర్జి (2)ని వెనక్కి పంపించిన సిరాజ్‌.. ఆ తర్వాత బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0) వెరినీ (15) ల‌ను పెవిలియ‌న్ కు చేర్చాడు.. భారత్ పేస్ బౌలింగ్ దెబ్బకు సౌతాఫ్రికా 55 పరుగులకే అలౌటైంది.బూమ్రా , ముఖేష్ లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఒక వికెట్ తీసుకున్నారు..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికాకు నాలుగో ఓవర్లోనే సిరాజ్‌ షాకిచ్చాడు. సిరాజ్‌ వేసిన ఆ ఓవర్లో మార్క్‌రమ్ (2)‌.. స్లిప్స్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సిరాజ్‌ తన తర్వాతి ఓవర్లో సఫారీ సారథి డీన్‌ ఎల్గర్‌ (4)ను బౌల్డ్‌ చేసి ఆ జట్టుకు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ (3) ను బుమ్రా ఔట్‌ చేశాడు. పదో ఓవర్లో సిరాజ్‌.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ జోర్జి (2) ను పెవిలియన్‌ చేర్చాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా.. 10 ఓవర్లలో 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఐదో స్థానంలో వచ్చిన బెడింగ్‌హమ్‌ (12) బుమ్రా వేసిన 11 వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఐదు ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న అతడిని సిరాజ్‌ ఔట్‌ చేశాడు. 16వ ఓవర్లో సిరాజ్‌ వేసిన రెండో బంతికి బెడింగ్‌హామ్‌.. జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇదే ఓవర్లో సిరాజ్‌.. ఐదో బంతికి మార్కో జాన్సెన్‌ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్‌కు ఇది ఐదో వికెట్‌. ఈ ఏడాది భారత్‌ తరఫున టెస్టులలో తొలి ఫైఫర్‌ సాధించిన బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాలో సిరాజ్‌కు ఇదే తొలి ఫైఫర్‌. మొత్తంగా మూడోవది.

ఇక 18వ ఓవర్లో సిరాజ్‌.. వికెట్‌ కీపర్‌ వెరీన్‌ (30 బంతుల్లో 15) ను ఔట్‌ చేయడంతో సఫారీలు ఏడో వికెట్‌ కోల్పోయారు. తొలి ఓవర్‌ వేసిన ముఖేశ్‌ కుమార్‌.. కేశవ్‌ మహారాజ్‌ (3)ను ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 8 వ వికెట్‌ను కోల్పోయింది. 11 బంతులాడి నాలుగు పరుగులు చేసిన బర్గర్‌ను బుమ్రా ఔట్‌ చేయగా ఎంగిడిని ముఖేశ్‌ కుమార్‌ పెవిలియన్‌ చేర్చడంతో సఫారీల కథ ముగిసింది. కేప్‌టౌన్‌ పిచ్‌పై సౌతాఫ్రికాకు టెస్టులలో ఇదే అత్యల్ప స్కోరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement