Monday, November 18, 2024

Second Test – మ‌ళ్లీ హిట్ మ్యాన్ కు నిరాశే… రోహిత్ డ‌కౌట్….

పుణే – స్వ‌ల్ప లక్షానికి న్యూజిల్యాండ్ ను క‌ట్ట‌డి చేశామన్న అనందం తొలి రెండు ఓవ‌ర్ల లోనే ఆవిరైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం టీమిండియా బ్యాటింగ్ కు దిగిన భార‌త్ జ‌ట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ సున్నా పరుగులకే అవుట్ కావడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 9 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ (0) కివీస్ పేసర్ టిమ్ సౌథీ బంతికి బౌల్డయ్యాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6, శుభ్ మాన్ గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంత‌కు ముందు పూణెలోని మోదీ స్టేడియంలో జరుగుతున్న సెకండ్‌ టెస్టులో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ లాథమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెన‌ర్ టామ్ లాథ‌మ్ ఔట‌య్యాడు. వ్య‌క్తిగ‌తం 15 ప‌రుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూ అయ్యాడు. అశ్విన్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. ఇక టీమిండియా ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. 259 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లతో కివీస్ ను దెబ్బకొట్టారు. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ డెవాన్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశారు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 18, డారిల్ మిచెల్ 18, టామ్ బ్లండెల్ 4 , సాంట్నర్​ 33 పరుగులు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement