Friday, November 22, 2024

Second Test – ఈసారి సాంట్న‌ర్ వంతు … సైకిల్ స్టాండ్ లా కుప్ప‌కూలిన భార‌త్

పుణె: కివీస్ స్పిన్న‌ర్ మిచ్చెల్‌ సాంట్న‌ర్ ఇండియ‌న్ బ్యాటింగ్ లైన‌ప్‌ను ఘోరంగా దెబ్బ‌తీశాడు. కివీస్ స్పిన్న‌ర్ ధాటికి టీమిండియా పుణె టెస్టు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 156 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 103 ప‌రుగుల ఆధిక్యం ద‌క్కింది. ఫ‌స్ట్ టెస్టులో ఓడిన రోహిత్ సేన‌.. రెండో టెస్టులోనూ పేల‌వంగా ఆడింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భార‌త టాప్ ఆర్డ‌ర్ త‌డ‌బ‌డింది..ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు..

ఈ మ్యాచ్ లో సాంట్న‌ర్ ఒక్క‌డే 19.3 ఓవ‌ర్ల‌లో 53 ర‌న్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. 16 పరుగుల వ‌ద్ద ఇవాళ రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా కేవ‌లం 140 ర‌న్స్ జోడించి ఆలౌటైంది. లంచ్ టైంకు ఏడు వికెట్ల‌కు 107 ర‌న్స్ చేసిన ఇండియా.. ఆ త‌ర్వాత 49 ర‌న్స్ జోడించి మ‌రో మూడు వికెట్ల‌ను కోల్పోయింది. గిల్, ర‌వీంద్ర జ‌డేజా, య‌శ‌స్వీలు మిన‌హా అంద‌రూ బ్యాటింగ్ లో చేతులెత్తేశారు..

- Advertisement -

సాంట్న‌ర్ టెస్టుల్లో తొలిసారి అయిదు వికెట్ల‌ను త‌న ఖాతాల‌ను వేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ సాంట్నార్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు భార‌త బ్యాట‌ర్లు ఇబ్బందిప‌డ్డారు. 103 ప‌రుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి దూకుడ‌గా బ్యాటింగ్ చేస్తున్న‌ది..అయితే తొలి వికెట్ ను కాన్వాయ్ రూపంలో కోల్పోయింది.. ఈ వికెట్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కి ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement