ఇండోర్ : ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టును స్టీవ్ స్మిత్ నడిపించనున్నాడు. తొలివన్డే ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్ ను సైతం గెలవాలని పట్టుదలగా ఉంది.. కాగా బుమ్రా స్థానంలో తుది జట్టులోకి ప్రసిద్ధ్‌ను తీసుకున్నారు.
భారత జట్టు: గిల్, గైక్వాడ్, శ్రేయస్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్, జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, షమీ, ప్రసిద్ధ్.