భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) స్పాన్సర్షిప్కి సంబంధించి మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌కు టైటిల్ స్పాన్సర్ హక్కులను కట్టబెట్టిన బీసీసీఐ, తాజాగా అధికారిక స్పాన్సర్‌గా ఎస్బీఐ లైఫ్‌కి హక్కులు దఖలుపరిచింది. మూడేళ్ల కాలానికి (2023-2026) బీసీసీఐ, ఎస్బీఐ లైఫ్ మధ్య రూ.47 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత జట్టు ఆడబోయే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎస్బిఐ లైఫ్ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.85 లక్షలు బీసీసీఐకి చెల్లిస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైన ఎస్బీఐ లైఫ్‌కు స్వాగతం. ఈ మూడేళ్లలో (56మ్యాచ్‌లు) వరల్డ్ కప్‌తో పాటు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో టీమిండియా అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవ#హరించనుంది అని ఓ ప్రకటనలో జైషా తెలిపాడు.