డబ్ల్యూపీఎల్‌లో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్‌కు చెందిన సయాలీ సద్గరే గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీతో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో జెయింట్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ బ్యాటర్ జొనాసెన్ షాట్ కొట్టగా డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్‌ను అందుకునే క్రమంలో హేమలత పట్టు తప్పింది. క్యాచ్ చేజారగా… బంతి ఆమె నుదుటికి బలంగా తాకింది. దాంతో కన్‌కషన్‌తో హేమలత మైదానం వీడింది. గుజరాత్ తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సయాలీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement