జెద్దా (సౌదీ అరేబియా) : సౌదీ స్మాష్-2024 టీటీ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా అద్భుత పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ బాత్రా 1-4 (11-7, 6-11, 4-11, 11-13, 2-11) తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్ స్టార్ హయాటా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలి గేమ్‌లో దూకుడు ప్రదర్శించిన మనిక తర్వాత గేముల్లో జపాన్ ప్రత్యర్థి జోరు ముందు నిలబడలేక ఓటమిపాలైంది. ఇక అంతకుముందు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో బాత్రా ప్రపంచ 14వ ర్యాంకర్ నినా మిట్టెల్హమ్ (జర్మనీ)ను 3-0తో చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన రౌండ్ 16 మ్యాచ్‌లో వరల్డ్ సెకండ్ ర్యాంకర్ వాంగ్ మాన్యు (చైనా)పై సంచలన విజయం సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనలు చేసిన మనిక బాత్రా తన ర్యాంక్‌ను కూడా మెరుగుపర్చుకుంది. 2018 కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ బాత్రా మళ్లి భారత నెంబర్-1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే రెండో ర్యాంక్‌కు పడిపోయిన మనికా తాజ ప్రదర్శనలతో ఆకుల శ్రీజను వెనక్కి నెట్టి మహిళల సింగిల్స్‌లో మళ్లిd భారత నెం.1 టీటీ ప్లేయర్‌గా అవతరించింది.