భారత షట్లర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. సాత్విక్ రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి వరల్డ్ చాంపియన్ షిప్ క్వార్టర్స్‌లో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టడమే కాకుండా మెడల్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడితో తలపడి ఈ రికార్డును సాధించింది. దీంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి పతకం అందుకోనున్న జంటగా సాత్విక్, చిరాగ్ శెట్టి జోడి నిలిచిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బిడబ్లుఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్ 2022లో భాగంగా చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం రెండో సీడ్ టకురో హోకి యూగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్ తొలిగేమ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జోడి 2422పై చేయి సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం .. చిరాగ్ సాత్విక్‌లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా …21115 తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 2114తొ టకురోహోకి యుగో కొబయాషీలను మట్టి కరిపించి విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక చిరాగ్ సాత్విక్ జోడి కామన్ వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే.
వరల్డ్ చాంపియన్ షిప్ క్వార్టర్స్‌లో సాత్విక్ రాజ్ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి రికార్డు
Advertisement
తాజా వార్తలు
Advertisement