ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్స్‌లో భారత నెంబర్ వన్ జోడి సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టికి ఓటమి ఎదురైంది. ఫలితంగా ఈ జోడి కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. సెమీ ఫైనల్లో మలేసియా జోడి వూయ్ యిక్ -ఆరోన్ చియా చేతిలో 20-22, 21-18, 21-16 తేడాతో పరాజయం పాలయ్యాడు. 77 నిమిషాల పాటు సాగిన హోరాహోరి సెమీస్ పోరులో 22-20తో తొలి గేమ్ నెగ్గిన సాత్విక్ చిరాగ్ జోడి ఆ తర్వాత 18-26, 16-21తో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయింది.
దీంతో కాంస్య పతకంతో టోర్నీని ముగించింది. కాగా మలేసియా ద్వయం చేతిలో సాత్విక్- చిరాగ్ జోడికి వరుసగా ఇది ఆరో ఓటమి. అయితే సెమీస్‌లో ఓటమి పాలైనప్పటికీ.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ జోడి అద్భుత ప్రదర్శన చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో భారత్‌కు పతకం దక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్ డబుల్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. పురుషుల విభాగంలో మొదటిది. అంతకుముందు 2011లో మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి కాంస్యం దక్కించుకుంది.