Thursday, January 23, 2025

Indonesia Masters | పోరాడి ఓడిన సాత్విక్ జోడి !

  • లక్ష్యసేన్‌ కూడా ఇంటికే

ఇండోనేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 16-21, 21-12, 21-23 తేడాతో జపాన్‌ స్టార్‌ కెంట నిషిమోటో చేతిలో పోరాడి ఓడాడు.

మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరెడ్డి-చిరాగ్‌ శెట్టి 20-22, 21-23 థాయిలాండ్‌ జంట కెర్డెన్‌-డెచపొల్‌ చేతిలో ఓడారు.

మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ద్వయం 21-13, 24-22, 18-21 తేడాతో గొ పెయ్‌ కీ-టెహ్‌ మెయ్‌ జింగ్‌ (మలేషియా) జంట చేతిలో ఓడింది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో పోరాటం ప్రి క్వార్టర్స్‌లోనే ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement