Sunday, January 19, 2025

India Open | ముగిసిన భార‌త్ పోరు…

  • సెమీస్‌లో సాత్విక్‌ జోడీ ఓటమి

ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 ప్రపంచ టూర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ల పోరాటం సెమీస్‌లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-18, 21-14 తేడాతో మలేషియాకు చెందిన మూడో సీడ్‌ గోహ్‌ జీ ఫీ-నూర్‌ ఇజుద్దీన్‌ జంట చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన సాత్విగ్‌ జోడీ అనూహ్యంగా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టారు. వీరి ఓటమితో ఇండియా ఓపెన్‌లో భారత్‌ ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే సింధుతో సహా మిగతా షట్లర్లందరూ ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement