Home క్రీడాప్రభ Santosh Trophy | సంబురాల మధ్య ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ..

Santosh Trophy | సంబురాల మధ్య ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ..

0

దాదాపు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాదులో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు ఈరోజుశ్రీనిధి ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభం అయ్యాయి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవిలు ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ జిపి ఫాల్గుణ, డిప్యూటీ డైరెక్టర్లు అశోక్ కుమార్, సుజాత, స్పెషల్ ఆఫీసర్లు భాష, మధు లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుట్బాల్ క్రీడకు జాతీయస్థాయిలో అతిపెద్ద టోర్నమెంట్ అయిన సంతోష్ ట్రోఫీ 57 సంవత్సరాల తర్వాత హైదరాబాదు నగరంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ ఫుట్ బాల్ కు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్ 20 24 ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ తోపాటు సంతోష్ ట్రోఫీ ని నిర్వహించామని మరిన్ని జాతీయ అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ వేదికగా మారనుందని ఆయన అన్నారు.

ఈరోజు జరిగిన మ్యాచ్ లు..

మణిపూర్ v/s సర్వీసెస్ 1-0 స్కోర్ తో మణిపూర్ జట్టు విజయం సాధించగా, తెలంగాణ v/s రాజస్థాన్ మ్యాచ్లో 1-1తో మ్యాచ్ డ్రా అయింది. సాయంత్రం 7:30 కు వెస్ట్ బెంగాల్ v/s జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య మరో పోటీ జరగనుంది.

రేపటి మ్యాచ్ ల వివరాలు :

గ్రూపు బి

1)కేరళ v/s గోవా (ఉదయం 9 గంటలకు )

2) తమిళనాడు v/sమేఘాలయ (మధ్యాహ్నం 2.30 గంటలకు)

3) ఢిల్లీ v/s ఒడిస్సా (సాయంత్రం 7:30 కు )

క్వార్టర్స్ ఫైనల్స్ వరకు మ్యాచ్ లన్ని శ్రీనిధి ఫుట్ బాల్ క్లబ్ అజీజ్ నగర్ లో జరుగుతుండగా, డిసెంబర్ 29న సెమీఫైనల్స్, డిసెంబర్ 31న ఫైనల్స్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి.

Exit mobile version