బెంగళూర్ – ఆర్సీబి బౌలర్ హర్షల్ వెంట వెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు.. ముందుగా జైశ్వాల్ వికెట్ ను దక్కించుకున్న హర్షల్ ఆ తర్వాత ఆర్ ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ ను పెవిలియన్ కు పంపించాడు.. సంజూ కేవలం 22 పరుగులు చేశాడు. అంతకుమందు మూడో వికెట్ గా 47 పరుగులు చేసిన జైశ్వాల్ ను కోల్పోయింది.. ఈ వికెట్ హర్షల్ పటేల్ కు లభించింది..అంతకు ముందు పడిక్కల్ రూపంలో రెండో వికెట్ ను కోల్పోయింది.. ధనాధన్ బ్యాటింగ్ చేసిన పడిక్కల్ 52 పరుగులకు విల్లీస్ బౌలింగ్ లో అవుటయ్యాడు..ముందుగా విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతిని డిఫెండ్ చేయబోయిన బట్లర్ అంచనా తప్పింది. బంతి వికెట్లను తాకింది. దాంతో, 1 పరుగు వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. అనంతరం జైశ్వాల్, పడిక్కల్ వికెట్ ల ను పొగొట్టుకుంది.. హెట్మయిర్ 2 , జురెల్ 2 పరుగుల తో క్రీజులో ఉన్నాడు 16 ఓవర్ లలో ఆర్ ఆర్ 4 వికెట్ ల నష్టానికి 129 పరుగుల చేసింది
అంతకు ముందు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకం బాదారు. దాంతో, నిర్ధారిత 20 ఓవర్ లలో ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్‌రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది