ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికా ఆటగాడు రాజీవ్‌రామ్‌తో జత కట్టిన సానియా రెండో రౌండులో నెదర్లాండ్‌కు చెందిన మాట్లే మిడిల్‌కూప్, ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లెన్‌పెరెజ్ జోడీని 7-6 (8/6), 6-4 తేడాతో ఓడించి ఆదివారం క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కోర్టు -3లో ఒక గంట 27నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-రామ్ జోడీ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. మాట్వేజోడీ చేసిన తప్పిదాలను అనుకూలంగా మార్చుకున్న సానియాజోడీ తొలి సెట్‌ను గెలుచుకుంది. అనంతరం రెండో సెట్‌ను గెలుచుకోవడంతో క్వార్టర్స్ బెర్త్ ఖరారైంది. అన్‌సీడెడ్ ఇండో-అమెరికా జోడీ ఆస్ట్రేలియన్-డచ్ జంటపై టైటిల్ దిశగా ముందడుగు వేసింది. సానియా జోడీకి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇది రెండో విజయం. కాగా గురువారం జరిగిన తొలిరౌండులో సానియా జోడీ సెర్బియా జంట అలెక్సంద్రా క్రునిక్-నికోలాను వరుస సెట్లలో 6-3, 7-6 (3) తేడాతో ఓడించింది.
మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ బార్టీ అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాకు షాక్ ఇచ్చింది. డిఫెండిగ్ ఛాంపియన్ నవోమీ ఒసాకాను ఓడించిన అన్‌సీడెడ్ అనిమోసిమోవాను బార్టీ 6-4, 6-3తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఆష్లేబార్టీ క్వార్టర్స్‌లో జెస్సికాతో తలపడనుంది. అదేవిధంగా ఫ్రెంచ్‌ఓపెన్ ఛాంపియన్ క్రెచికోవా రెండుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ విజేత విక్టోరియా అజెరింకాపై 6-2, 6-2తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న నాదల్ ఆదివారం క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ఈక్రమంలో నాదల్ ఫ్రాన్స్‌కు చెందిన అదిరన్‌ను 7-6 (16/14), 6-2, 6-2తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించాడు. 35ఏళ్ల నాదల్ క్వార్టర్ ఫైనల్లో కెనడాకి చెందిన 14వ సీడ్ షపోవలోవ్‌తో సెమీస్‌బెర్త్ కోసం తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో డెనిస్ షపోవలోవ్ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 6-3, 7-6 (7/5), 6-3తేడాతో గెలుపొంది క్వార్టర్ పోరుకు అర్హత సాధించాడు. 2గంటల 21నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షపోవలోవ్ విజయం సాధించడంతో జ్వెరెవ్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..