Saturday, November 23, 2024

శాంసన్‌కు క్రమశిక్షణ అవసరం : రవిశాస్త్రి..

న్యూఢిల్లి : రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌పై టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెటర్స్‌లో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ఒకడన్నాడు. శాంసన్‌ పెద్ద టోర్నీల్లో రాణించలేకపోతున్నాడని, భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అంచనాలు అందుకోలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో సంజూ.. ఆటను గమనిస్తున్నట్టు వివరించారు. ఈ లీగ్‌లో సంజూ ఎంతో కామ్‌గా ముందుకు వెళ్తున్నాడని, ఈ సారి స్థిరంగా పరుగులు చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపాడు. నిజానికి సంజూ.. తన సహజ సిద్ధమైన ఆటతో భారీ స్కోర్‌ చేయగలడని, అయితే అతను ప్రత్యర్థి బౌలర్లను గమనించాలని సూచించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించి.. ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడని, అతనిలా భారీ స్కోర్‌ చేయాలంటే.. శాంసన్‌ మరింత క్రమశిక్షణతో ఆడాలని కోరాడు. సంజూ నాయకత్వంలోని రాజస్థాన్‌ జట్టు మూడు మ్యాచులు ఆడి రెండు మ్యాచులు గెలిచింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 124 మ్యాచులు ఆడిన శాంసన్‌.. 29 సగటుతో 3161 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 119గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement