అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాత్కాలిక అధ్యక్షుడిగా సైఫ్ అహ్మద్ (ఈజిప్టు) నియమితులయ్యారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో సైఫ్ అహ్మద్‌ను తాత్కాలిక నియమించినట్లు ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బుధవారంనాడొక ప్రకటనలో తెలిపారు.
నవంబర్‌లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష ఎన్నిక జరుగనుందని చెప్పారు. తదుపరి అధ్యక్షుడి ఎన్నియ్యేంత వరకు సైఫ్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని ఎఫ్ఐహెచ్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.