యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ బెలారస్ స్టార్ అర్యానా సబలెంక తొలిసారి విజేతగా నిలిచింది. గతేడాది తుదిమెట్టుపై బోల్తాపడి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను చేజార్చుకున్న సబలెంక…. ఈసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈరోజు (ఆదివారం) జరిగిన ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాపై 7-5, 7-5తో వరుస సెట్లను గెలిచింది.
కాగా, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన సబలెంక ట్రోఫీతో పాటు 3.6 మిలియన్ డాలర్లను అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన జెస్సికా పెగులా 1.8 మిలయన్ డాలర్లు గెలుచుకుంది. జెస్సికా తొలిసారి క్వార్టర్స్‌ను అధిగమించి అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరింది.