డబ్ల్యుటిఎ ర్యాంకుల్లో అరీనా సబలెంకా మళ్లి నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఇగా స్వియాటెక్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ ఏడాది నంబర్ వన్ ఎవరన్నది వచ్చే నెలలో తేలనుంది. సౌదీ అరేబియాలో జరిగే డబ్ల్యుటిఎ ఫైనల్స్ 2024 టాప్ ర్యాంకర్‌ను నిర్ణయిస్తుంది.
ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్‌లతోపాటు సిన్సినాటి, వుహాన్ టోర్నీ విజయాలతో సబలెంకా ఈ సీజన్‌ను ఉత్సాహంగా ప్రారంభించింది. గతేడాది కూడా సబలెంకా ఏకంగా 8 వారాలు టాప్ ర్యాంక్‌లో కొనసాగింది. ఈసారి కూడా ఆ రికార్డును మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నానని ఈ బెలారస్ భామ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సబలెంకా 9706 పాయింట్లు, స్వియాటెక్ 9665 పాయింట్లతో ున్నారు. సౌదీ ఫైనల్స్ విజేతకు 1500 పాయింట్లు లభిస్తాయి.