దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు రుతురాజ్ ఎంపికపై చీఫ్ సెలెక్టర్ చేతన్‌శర్మ స్పందించాడు. దేశవాళీ టోర్నీల్లో రుతురాజ్ ప్రదర్శన ఆధారంగానే అతడిని ఎంపిక చేశామని వివరించాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన రుతురాజ్ వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడని సెలెక్టర్లు ఎంపిక చేశారని చేతన్‌శర్మ తెలిపాడు. 24ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ గత ఏడాది ఐపీఎల్‌లోనూ పరుగుల వర్షం కురిపించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన రుతురాజ్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ అత్యధికంగా 168పరుగుల వ్యక్తిగత స్కోరుతోపాటు మొత్తం 603పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారతజట్టుకు ఎంపికైన రుతురాజ్ రెండు మ్యాచ్‌ల్లో 38పరుగులు మాత్రమే చేశాడు.
అనంతరం ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. కాగా కెఎల్ రాహుల్ సారథిగా దక్షిణాఫ్రికాతో తలపడే భారతజట్టులో ధావన్‌తో కలిసి రుతురాజ్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, భువనేశ్వర్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌లతో కూడిన భారతజట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital