టాటా ఐపీఎల్‌లో బలమైన బౌలింగ్ విభాగం ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై ఓపెనర్లు దంచికొట్టారు. ముఖ్యంగా ఫామ్ కోసం తంటాలు పడుతూ కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. మరో పరుగు తీసి ఉంటే సెంచరీ చేసి ఉండేది. అతనికి డెవాన్ కాన్వే (85 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. కాగా, రెండో వికెట్‌గా వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇక.. రుతురాజ్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో చెన్నై స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కాగా, సన్‌రైజర్స్‌కి చెన్నై 203 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది.
Breaking: రుతురాజ్ సెంచరీ మిస్, అదరగొట్టిన చెన్నై బ్యాట్స్‌మన్.. 20 ఓవర్లకు 202/2
Advertisement
తాజా వార్తలు
Advertisement