హైదరాబాద్ ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది.. నిర్ధారిత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.. గెలుపు కోసం సన్ రైజర్స్ 204 పరుగులు చేయవలసి ఉంది… ఈ టోర్నమెంట్ రెండు వందలకు పైగా పరుగులు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
అంతకు ముందు ఆర్ ఆర్ స్కిపర్ సంజు శాంసన్ 55 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లో అయిదో వికెట్ గా వెనుతిరిగాడు… ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి.. ఇక అంతకు ముందు రియాగ్ పరాగ్ ఏడు పరుగులు చేసి నటరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.. దేవదత్త పడిక్కట్ మూడో వికెట్ రూపంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు.. పడిక్కల్ కేవలం 2న పరుగులు మాత్రమే చేశాడు.. అలాగే ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 54 పరుగులు చేసి ఫారూఖీ బౌలింగ్ లో ఔటయ్యారు.. కాగా జైశ్వాల్ ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 34 బంతులలో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ పరుగులలో8 ఫోర్లు ఉన్నాయి. ఇక బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. అశ్వీన్ 3 , హెట్మెయిర్ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.. నటరాజన్, ఫారూఖీ రెండేసి వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ దక్కింది..
ఐపిఎల్ – సన్ రైజర్స్ కి భారీ టార్గెట్ – ఆర్ ఆర్ 203/5
Advertisement
తాజా వార్తలు
Advertisement