న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా టేలర్ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు. 17 సంవత్సరాల పాటు మద్దతుగా నిలిచిన అందరికీ టేలర్ ధన్యవాదాలు ప్రకటించారు.
కివీస్ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన టేలర్.. న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు (18,074) చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచులు పూర్తిచేసుకున్న ఏకైక క్రికెటర్‌గానూ తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు. 445 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. టేలర్ ఇప్పటి వరకు 110 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ20లు ఆడాడు.
ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన టేలర్.. 17 ఏళ్లపాటు తన కెరియర్ అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమన్నాడు. టేలర్ రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అతడిని ‘లెజెండ్’గా అభివర్ణించాడు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని టేలర్ ట్విటర్లో పేర్కొన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital