దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో తన కెరీర్‌లో ఇప్పుడు ఓ కొత్త అడుగు వేశారు. రెండు దశాబ్ధాల పాటు ఫుట్‌బాల్‌ను శాసించిన అతను.. ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్‌గా మారాడు. కొత్తగా అతను యూట్యూబ్ ఛానల్ యూఆర్ క్రిస్టియానోను స్టార్ట్ చేశాడు.
అయితే ఆ ఛానల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్‌లో అతి తక్కువ సమయంలో మిలియన్ సబ్‌స్క్రైబర్లు అందుకున్న రికార్డును యూఆర్ క్రిస్టియానో ఛానల్ అందుకున్నది. అంతే కాదు, 24 గంటల్లోనే రోనాల్డో యూట్యూబ్ అకౌంట్ కోటి దాటి వరల్డ్ రికార్డును సృష్టించింది.
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో.. అత్యధికంగా జనం ఫాలోఅవుతున్న ఫేమస్ పర్సనాల్టీల్లో రోనాల్డో ఒకరు. ఎక్స్ అకౌంట్‌లో ఆయనకు 112.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 63.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్నాళ్ల వెయిటింగ్ ముగిసిందని, చివరకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసిందని, సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ రోనాల్డో తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.