ఐపీఎల్‌లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం ప్రకారం, మ్యాచ్ సమయంలో అదనపు బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనపై టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ రూల్ తనను ఆకట్టుకోలేదని, ఇది ఆల్ రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అన్నారు.
ఈ క్రమంలో రోహిత్ వ్యాఖ్యలపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. రోహిత్ వ్యాఖ్యలను తాను గమనించానని… ఇంపాక్ట్ రూల్ పై తప్పకుండా దృష్టి సారిస్తామని చెప్పారు. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఇంపాక్ట్ రూల్‌లో మార్పులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే, గేమ్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టినప్పుడు, ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయిని పేర్కొన్నారు.