టీ20 ప్రపంచకప్‌లో కీలక సెమీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడిచేతికి గాయమైంది. ముంజేతిపై గాయమైందని, ఆ సమయంలో తీవ్ర నొప్పితో బాధపడ్డాడని సమాచారం. దెబ్బతగిలిన తర్వాత రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదని, అయితే కొద్దిసేపటి తర్వాత నొప్పినుంచి తేరుకున్నాడని, ప్రాక్టీస్ సెషన్‌ను సానుకూలంగానే ముగించాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే గురువారం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు పూర్తిగా సిద్ధవుతాడా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. రోహిత్ గాయం తీవ్రత గురించి టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు టోర్నీలో రోహిత్ అంతగా రాణించలేదు. కేవలం 89పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్ పై మాత్రమే 53 పరుగులతో రాణించాడు.
- Advertisement -