టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ క్రికెట్ అకాడమీలపై ఫోకస్ చేశాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆలోచన చేస్తున్నాడు. ఇందులోభాగంగా జూలైలో యూఎస్‌లోని డల్లాస్‌లో అకాడమీని ప్రారంభించింది. ఇప్పుడు ఇండోనేషియా వంతైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఇండోనేషియాలో క్రికింగ్‌డమ్ అకాడమీని ఇండోనేషియాలో ప్రారంభించా డు.
రోహిత్ ఫ్రెండ్, టీమిండియా ఆటగాడు ధావల్ కులకర్ణి దీన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఇండోనేషియా క్రికెట్‌కు కో-ఫౌండర్, సీఈఓ చేతన్ సూర్యవంశీ కాగా, బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్‌శర్మ వ్యవహరించనున్నాడు. దావల్ కులకర్ణి మెంటార్‌గా ఉంటాడు.
ప్రపంచవ్యాప్తంగా కాకుండా 35 బ్రాంచ్‌లను కలిగివుంది క్రికింగ్‌డమ్. దేశ విదేశాల్లో కూడా అకాడమీలను ప్రారంభిస్తోంది. సింగపూర్, జపాన్, అమెరికా, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో ఢిల్లీ, యూపీ, కర్ణాటక, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో అకాడమీలు క్రికింగ్‌డమ్ సొంతం.
క్రికెట్‌ను అభివృద్ధి చేయాలన్నది క్రికింగ్‌డమ్ ప్రధాన లక్ష్యం. ఔత్సాహిక క్రికెటర్లకు క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలనేది అసలు ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా కోచ్‌లను నియమించి వారి ద్వారా ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనుంది. కోచింగ్ ద్వారా క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపరచడమేకాదు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వారిని సిద్ధం చేయనుంది. ఫుల్‌బాల్ మాదిరిగా క్రికెట్‌ను విస్తరిస్తాలన్నది అసలు డ్రీమ్.