ప్రపంచకప్ గెలవడానికి రోహిత్ శర్మ చిన్న నాటి కోచ్ దినేష్ టీమ్ ఇండియాకు ఒక కీలక సలహా ఇచ్చాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలంటే ఆ జట్టు ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఆడకూడదని సూచించాడు. ఆటగాళ్లు తమ పనిభారాన్ని నిర్వహించడానికి పూర్తిగా ఫిట్‌నెస్ ఉండాలంటే ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.
గత కొన్నేళ్లుగా భారత జట్టు ప్రపంచకప్‌ను గెలవలేకపోయింది. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న టీమ్ ఇండియా 2011 నుంచి ప్రపంచకప్ టైటిల్ గెలవలేదు. గత టీ 20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన టీమిండియా ఈ సారి కూడా సెమీ ఫైనల్‌లో ఓడి నిష్క్రమించాల్సి వచ్చింది.
టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం ఆటగాళ్లు అలసిపోవడమేనని చాలా సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆటగాళ్లు అలసిపోకుండా రిఫ్రెష్‌గా ఉండటానికి ఐపిఎల్ ఆడకూడదని రోహిత్ శర్మ చిన్న నాటి కోచ్ అభిప్రాయపడ్డాడు.