Friday, November 22, 2024

రోహిత్‌ శర్మ 400వ మ్యాచ్‌, శ్రీలంకతో రెండో టెస్టు.. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌

శ్రీలంకతో బెంగళూరు వేదికగా టీమిండియా రెండో టెస్టు ఆడనుంది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌లు ఆడిన క్లబ్‌లో హిట్‌ మ్యాన్‌ చేరబోతున్నాడు. 2007లో తొలిసారి భారత్‌ జట్టుకు రోహిత్‌ ఆడాడు. 16 ఏళ్ల కెరీర్‌ కొనసాగిస్తున్నాడు. జూన్‌ 23న ఐర్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌ ఆడాడు. అదే ఏడాది సెప్టెంబర్‌ 19న ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. అయితే టెస్టుల్లో మాత్రం ఆరేళ్ల తరువాత అంటే.. 2013లో నవంబర్‌ 6న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడాడు.

శ్రీలంక టెస్టుతో.. 400వ మ్యాచ్‌..

16 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడాడు. 12వ తేదీ నుండి శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అన్ని ఫార్మాట్స్‌ కలిపితే ఇది 400వ మ్యాచ్‌. టెస్టుల్లో 44 మ్యాచులు, 230 వన్డే మ్యాచ్‌లు, 125 టీ20 మ్యాచులు ఆడాడు. ఈ క్రమంలో 41 సెంచరీలు, 84 హాఫ్‌ సెంచరీలు, 4సార్లు డబుల్‌ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్‌ 264పరుగులు. మొత్తం 15,672 పరుగులు కొట్టాడు. 44 టెస్టులు ఆడిన రోహిత్‌ 46 సగటుతో 3,076 రన్స్‌ చేశాడు. 8 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలున్నాయి. ఓ సారి డబుల్‌ సెంచరీ చేశాడు. వన్డే ఫార్మాట్‌లో 230 మ్యాచుల్లో 48 సగటుతో 9,283 రన్స్‌ చేశాడు. 29 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలున్నాయి. మూడు సార్లు డబుల్‌ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్‌ 264. టీ20 మ్యాచ్‌లు 125 ఆడాడు. 32 సగటుతో 3,313 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 118 పరుగులు కావడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా రోహిత్‌ శర్మ పేరు మీదనే ఉండటం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement