Thursday, November 21, 2024

ఆసియా కప్‌కు రోహిత్‌ సేన… జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ధావన్‌

టీమిండియా క్రికెటర్లు వరుస టూర్లకు సిద్ధమ య్యారు. ఆగస్టులో ఇటు ఆసియా కప్‌, అటు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ భారత్‌ జట్టు ఆడనుంది. ఒకే సమయంలో రెండు పర్య టనలు ఉండడంతో ఆసియాకప్‌కు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని సీనియర్ల జట్టు, జింబాబ్వేకు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్తున్న కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని జూనియర్‌ జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్‌ జరుగనుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఆగస్టు 18న హరారే వేదికగా జరనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement