న్యూఢిల్లి: టెస్టు కెప్టెన్‌గా వెటరన్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్‌లలో ఒకరిని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ దిలీప్ వెంగసర్కార్ సూచించారు. ఏడాది పాటు వీరిలో ఒకరికి పగ్గాలు అందజేయాలి. ఈ కాలంలో.. భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసుకోవాలి. నేను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ.. ఇలాంటి సమస్యే వచ్చింది.
అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ద్రావిడ్ తప్పుకున్నాడు. దీంతో అయోమయం ఏర్పడింది. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా ఉన్న ధోనీని టెస్టు కెప్టెన్‌గా నియమించాలనే సూచనలు వచ్చాయి. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా పర్యటనకు సీనియర్ ఆటగాడైన అనిల్ కుంబ్లేను కెప్టెన్‌గా నియమించాం. అప్పుడు కుంబ్లే బాగా రాణించాడు. అదే సమయంలో ధోనీని భవిష్యత్ టెస్టు కెప్టెన్‌గా తీర్చిదిద్దాం.