టెన్నిస్ ప్రపంచంలో ఆమెరికా,రష్యా, జెకోస్లొవికియా, స్వీడెన్ లదే అధిపత్యం … భారత క్రీడాకారులు సానియా మీర్జా, రోషన్ బొప్పన్నలు కొన్ని టైటిల్స్ గెలిచి మనదేశ ఉనికిని చాటారు. అయితే ఇంత వరకూ మనదేశానికి చెందిన క్రీడాకారులు ఎవ్వరూ టాప్ ర్యాంక్ లోకి రాలేకపోయారు. తాజాగా ఆ కొరతను తీర్చేశాడు భారత స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న.
43 ఏళ్ల పెద్ద వయసులో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుకు చేరుకోవడంపై బోపన్న స్పందించాడు. ”నా 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వారాలపాటు టోర్నీలు ఆడుతూ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. భారత్ తరఫున టాప్ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. టీమ్ మొత్తానికి క్రెడిట్ వస్తుంది. కుటుంబం, కోచ్, ఫిజియో.. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇది భారత టెన్నిస్‌కు అత్యంత ముఖ్యం. మరింత మంది క్రీడాకారులు రావడానికి మార్గం చూపిస్తుందని భావిస్తున్నా” అని వ్యాఖ్యానించాడు.