Saturday, November 9, 2024

వింబుల్డన్: ఈ దిగ్గజాలకు ఇదే ఆఖరిదా..?

నేటి నుంచి వింబుల్డన్ ప్రారంభం కానుంది. టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజాలుగా పేరుగాంచిన రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ కి ఇదే చివరి వింబుల్డన్ కావచ్చని క్రీడా పండితులు భావిస్తున్నారు. వీరిద్దరి వయసూ 40ల్లో పడటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలంలో మోకాలి సర్జరీ చేయించుకున్న ఫెదరర్, గతంలో రాణించిన స్థాయిలో సత్తా చూపగలడా? అన్న అనుమానాలున్నాయి. ఇక నాలుగేళ్ల క్రితం ఒలింపియాకు జన్మనిచ్చిన తరువాత, సెరీనా విలియమ్స్ ఇప్పటివరకూ ఒక్క మేజర్ టైటిల్ ను కూడా గెలవలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ ను సంపాదించిన ఆమె, వింబుల్డన్ లో విజయం సాధించి, ఎనిమిదో టైటిల్ ను గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది.

ఏదిఏమైనా, టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న ఫెదరర్, సెరీనాలు తమ ఆట తీరుతో సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్ లు గెలిచి, టైటిల్ పోరుకు దగ్గర కావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఓటమిని అంత తేలికగా అంగీకరించే అలవాటు లేని ఫెదరర్ ను ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంత సులభమేమీ కాదనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement