స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ వింబుల్డన్ మూడవ రౌండ్ లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ కు చెందిన రిచర్డ్ గ్యాస్కట్ తో తలపడి గెలిచాడు. మూడు వరుస సెట్లలో 7-6(1), 6-1, 6-4 తేడాతో ఫెదరర్ గెలవడం గమనార్హం. మరో మ్యాచ్ లో రెండో సీడ్ మెద్వదేవ్, స్పెయిన్ కు చెందిన అల్కర్జ్ గార్ఫియాపై పోటీ పడి, 6-4, 6-1, 6-2 తేడాతో గెలిచాడు. మహిళల సింగిల్స్ విషయానికి వస్తే, ఇప్పటికే పలువురు టాప్ సీడ్స్ వైదొలగగా, మూడో సీడ్ గా బరిలోకి దిగిన స్వితోలినా కూడా అదే దారిలో నడిచింది. పోలెండ్ కు చెందిన మగ్దా లిన్నెట్టితో పోటీ పడిన ఆమె 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది. బ్లింకోవాపై బార్టీ 6-4, 6-3 తేడాతో గెలువగా, 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా 6-2, 6-2 తేడాతో డోనా వికిక్ పై విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసిన స్ప్రింటర్ ద్యూతీ చంద్